అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఈనెల 29వ తేదీన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేరిన అతను చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందారని వైద్యులు తెలిపారు. దీంతో మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.