తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఎనిమిదో రోజైన బుధవారం ఉదయం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. ఉభయదేవేరులతో ఆశీసులైన శ్రీమలయప్పస్వామివారి రథోత్సవంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తో కలిసి కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని రథాన్ని