నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం కటికవానికుంట రోడ్డు మార్గం నుండి మద్దిలేటి స్వామి క్షేత్రానికి ఆటో వెళ్తుండగా శనివారం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం తొమ్మిది మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా శివమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెంది మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి మిగిలిన వారికి స్వల్ప గాయాలు అయ్యాయి మృతి చెందిన మహిళ కడప జిల్లా పెద్దముడియం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు