మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లను అందజేయనున్నట్లు వర్ని వ్యవసాయ అధికారి రాజశేఖర్ వెల్లడించారు. ఎస్ సి, ఎస్ టి మహిళా రైతులకు 50 శాతం, జనరల్ మహిళా రైతులకు 40 శాతం సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. వ్యవసాయం చేస్తూ ఇప్పటివరకు యాంత్రీకరణలో లబ్ధి పొందని రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. చేతి పంపులు, పవర్ ఆపరేటెడ్ స్పెయర్స్ , రోటవేటర్, బ్రష్ కట్టర్, కల్టివేటర్, కేజ్ వీల్స్ సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందన్నారు. అవసరమైన రైతులు దరఖాస్తు తో పాటు పట్టేదారు పాస్ పుస్తకము ,ఆధార్ కార్డు జిరాక్స్, ట్రాక్టర్ ఆర్ సి జిరాక్స్ తో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.