సేనానితో సేన అనే పేరుతో జనసేన పార్టీ ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు విశాఖపట్నంలో సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశంలో, పార్టీని బలోపేతం చేయడం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి రెండు ప్రధాన అజెండాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో చర్చిస్తారు. అయితే పార్టీలో అంతర్గతంగా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ బలహీనంగా ఉందని, తమకు సరైన గుర్తింపు లభించడం లేదని కార్యకర్తలు వాపోతున్నారు. సొంత నియోజకవర్గాల్లో కూడా ఇతర నాయకుల ఆధిపత్యం ఎక్కువగా ఉందని వాపోతున్నారు.