ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టిడిపి కార్యాలయం నందు పట్టణానికి చెందిన బాధితురాలు మానసిక వికలాంగురాలైన తన కూతుర్ని తీసుకుని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డిని కలిశారు. తన కూతురికి మానసిక ఆరోగ్యం బాగా లేనందున వచ్చే పింఛన్ 6000 రూపాయలు మందులకు సరిపోవడం లేదని ఎమ్మెల్యేలకు తెలిపారు. దేనితో ఎమ్మెల్యే సంబంధిత సమస్యను ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి సహాయం అందేలా చేస్తానని బాధితురాలికి తెలియజేశారు. అనంతరం ఆమె సంతృప్తిని వ్యక్తం చేశారు.