తెలంగాణ-ఛత్తీస్ గఢ్ సరిహద్దు ములుగు జిల్లా అడవుల్లో మరో అద్భుత జలపాతం నేడు శుక్రవారం రోజున బయట పడింది. కొండల పైనుంచి పాల ధారలు జాలువారుతున్న ఆ జలపాతం సందర్శకులను తెగ ఆకట్టుకుంటోంది. వెంకటాపురం మండలంలోని పాత్రపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో ఈ జలపాతం కనువిందు చేస్తోంది. సుమారు 120 అడుగుల ఎత్తైన కొండల పైనుంచి పాలధారలా కిందకు దూకుతున్న ఈ జలపాతాన్ని పిడుగులొద్ది జలపాతం అని పిలుస్తారు.