రామాయంపేట మండలంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న 8300 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని స్థానిక బస్టాండ్ వద్ద రోడ్డు పై బైటాయించి నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు బండారి ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల గురవుతున్నారు అని ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు మీరు ఇచ్చేది బిక్ష కాదు అని అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నారు.