భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టరేట్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని శనివారం సాయంకాలం ఐదున్నరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వంటింట్లో జరిగే ప్రమాదాలను ఏ విధంగా అరికట్టొచ్చు మాక్ డ్రిల్ ద్వారా ఎన్డీఆర్ బృందం అవగాహన కలిగించారు. పాము కాటు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారు వివరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి ఆ బృందాన్ని అభినందించారు.