మంగపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం నరసింహ సాగర్ నుంచి శనిగకుంట గ్రామానికి వరినాటు కోసం వెళుతున్న కూలీల ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది కూలీలకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.