అన్నదాత పోరు పోస్టర్ను వైసీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఆదివారం నల్లమడలో ఆవిష్కరించారు. ఈ నెల 9న ప్రతి ఆర్డీవో కార్యాలయం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచుతోందన్నారు. ఎరువులు అందించే విషయంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతుల పక్షాన వైసీపీ పోరాడుతుందన్నారు.