ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని ఆసిఫాబాద్ జిల్లా పంచాయతీ అధికారి బిక్షపతి గౌడ్ అన్నారు. గురువారం తిర్యాణి మండలంలోని ఉల్లిపిట్ట గ్రామపంచాయతీ పరిధిలో గల దంతంపల్లి గ్రామం, భీమ్జి గూడ, గిన్నెధరి బాలికల ఆశ్రమ పాఠశాలలను మండల పరిషత్ అభివృద్ధి అధికారి మల్లేష్ తో కలిసి సందర్శించి పాఠశాలల పరిసరాలు, విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ అధికారి మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించాలన్నారు.