ఆలూరు నియోజకవర్గంలో శుక్రవారం వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా స్టేషన్, ఆన్లైన్ పర్మిషన్ తీసుకోవాలని సీఐ రవిశంకర్ రెడ్డి సూచించారు. పండుగలో శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వివాదాలు రాకుండా పరస్పర సహకారం అవసరమన్నారు. చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని చెప్పారు.