విజయవాడ నిర్మల కాన్వెంట్ రోడ్ లో భారీగా వర్షపు నీరు చేరుకుంది. గత రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. గురు నానక్ నగర్ ప్రాంతంలో రెండు అడుగులు మేరకు ప్రధాన రోడ్లో వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనదారులు, పాదాచార్యులు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు. మున్సిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ మ్యాన్ హోల్ లో నుండి వాటర్ ను ట్యాంకులోకి ఎక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనయ్యారు