చింతల మానేపల్లి మండలం దింద గ్రామ ప్రజలు చేస్తున్న పోడు భూముల సాధన పాదయాత్రలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. పోడు రైతులకు పట్టాలిచ్చి, అటవీ అధికారుల ఆగడాల నుంచి రక్షణ కల్పించాలని, రైతు భరోసా, రైతు బీమా, పంట రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. పోడు రైతుల పాదయాత్ర సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గం లోని ములుగు ప్రాంతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాదయాత్రలో పాల్గొన్నారు,