కళ్యాణదుర్గం లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో బుధవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి మాత మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మహిళా భక్తులు భారీగా తరలివచ్చారు. ద్వాదశ హారతులు, మహా మంగళహారతి వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు.