రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో నెంబర్ 1793ను వెంటనే రద్దు చేయాలని, ఈ జీఓ వల్ల బలిజల మనోభావాలు దెబ్బతింటున్నాయని పులివెందుల శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం అధ్యక్షులు గూడూరు ప్రసాద్ నేతృత్వంలో బలిజ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. పులివెందుల ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో చిన్నయ్యకు సోమవారం వారు వినతి పత్రం సమర్పించి తమ సమస్యలను వివరించారు.