ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని నల్లమల అడవి ప్రాంతంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వినేపద్యంలో మండలంలోని పెద్ద బొమ్మలాపురంలో గండి చెరువుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో అలుగు మీదుగా కిందకు నీరు పారుతుంది. మరోవైపు రాళ్ల తీగలేరు వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువు ఆయకట్టు రైతులకు మేలు చేకూరుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.