ప్రజల సంక్షేమం కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం చేపట్టినట్లు పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని రాంనగర్ కాలనీలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. సరైన ధ్రువపత్రాలు లేని 65 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటో లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలతో పోలీసులు మమేకం అయ్యేందుకు ఈ కార్యక్రమం నిర్వహించామని అన్నారు.