Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 4, 2025
ఉదయగిరి ప్రాంతంలో ఇటీవల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. సీతారాంపురం-దుత్తలూరు హైవేపై ఇటీవల పశువల కారణంగానే ప్రమాదాలు జరిగి కొందరు చనిపోగా మరికొందరు గాయపడ్డారు. కుర్రపల్లి, సర్వరాబాదు, దాసరిపల్లి, సోమల రేగడ, ఉదయగిరి గ్రామాల సమీపంలో జరిగిన ప్రమాదాలే ఇందుకు ఉదాహరణలు. హైవేపైకి పశువులకు రాకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.