పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోటీ చేయడం పిఠాపురం నియోజకవర్గ ప్రజల అదృష్టం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో శాశ్వత ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు మేమంతా కృషి చేస్తామని పేర్కొన్నారు.