ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలోని శ్రీశైలం దోర్నాల నల్లమల అడవి ప్రాంతంలో అటవీ శాఖ అధికారులకు వాహనదారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న వాహనదారులకు జరిమానా విధించే క్రమంలో మాట మాట పెరిగింది. శ్రీశైలం మల్లన్న దర్శనానికి వస్తున్న భక్తుల పట్ల ఫారెస్ట్ అధికారుల వ్యవహార తీరు బాగోలేదని భక్తుల ఆరోపించారు. స్పీడ్ గా వెళ్లే అన్ని వాహనాలకు జరిమానా విధించాలి కానీ వారికి ఇష్టం వచ్చిన వాహనాలకు మాత్రమే జరిమానా విధిస్తున్నారని వాపోయారు.