పెద్దమందడి మండలం వెల్టురు స్టేజ్ 44 వ జాతీయ రహదారి దగ్గర,కారు బైక్ ను ఢీ కొట్టడం తో ఒక్కరికి గాయాలు అయ్యాయి. బాధితుల వివరాల మేరకు వెల్టురు గ్రామానికి చెందిన బత్తుల ఎల్లన్న తన బైక్ పై శుక్రవారం ఉదయం 11 గంటలకు వెల్టురు గ్రామ స్టేజి దగ్గర టర్న్ తీసుకుంటుండగా కర్నూల్ నుండి హైదరాబాద్ వెళ్తున్న ఇన్నోవా వెనుక నుండి ఢీకొట్టింది. గాయపడ్డ బత్తుల ఎల్లన్న కు తీవ్ర గాయాలు అయ్యాయి.స్థానికులు 108 అంబులెన్స్ లో వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెద్దమందడి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని రోడ్డుపై ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా, చర్యలు చేపట్టారు.