-ఇందిరమ్మ ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల పనులను వేగవంతంగా పూర్తి చేయాలి :జిల్లా కలెక్టర్ జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం దమ్మాయిపేట గ్రామంలో పంచాయతీ భవన నిర్మాణ పనులను, అంగన్వాడి స్కూల్ భవన నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన భూ స్థలంలో నిర్మాణ పనులను, మరియు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం పరిశీలించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం సాయంత్రం 6-30 గంటల ప్రాంతంలో వివరాలు వెల్లడించింది.దమ్మాయిపేట్ గ్రామంలో (ఈ జీ ఎస్) మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులను పరిశీలించి, నాణ్యతగా వేగవంతంగా పూర్తి చేయాలని...