శ్రీ సత్యసాయి జిల్లా రోద్దం మండల సర్పంచ్కి గ్రామ ప్రజలు శనివారం సాయంత్రం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అన్ని గ్రామ పంచాయతీల్లో ఆర్డీటీ ఎఫ్సీఆర్ఎ రెన్యూవల్ కోసం సర్పంచ్లకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించిన సందర్భంలో ఈ మేరకు వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు. ఆర్డీటీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను తెలుపుతూ ఈ కార్యక్రమం చేపట్టినట్లు గ్రామస్థులు తెలిపారు.