కొరిశపాడు మండలం మేదరమెట్ల జాతీయ రహదారి వద్ద గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి వైజాగ్ వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఫెన్సింగ్ దిమ్మలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 లో ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తు ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. గాయపడిన వారు కృష్ణమూర్తి డాల్ఫిన్ రాబర్ట్ గా తెలియజేశారు.