గురువారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వర్తక వాణిజ్య వ్యాపారులు శుక్రవారం రోజున బందుకు పిలుపునిచ్చారు... ఓయూ జెఎసి ఇచ్చిన పిలుపుమేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారుల అమ్మకాలకు నిరసిస్తూ బందుకు పిలుపునిచ్చినట్లుగా పేర్కొన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు జిఎస్టి కట్టకుండా జీరో దందా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని నాణ్యతలేని వస్తువులు తీసుకొస్తూ తక్కువ ధరలకు ప్రజలకు అంటగడుతూ వ్యాపారాలను దెబ్బతీస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ తెలిపారు స్వచ్ఛందంగా వ్యాపారులు బందు కు మద్దతు పలికాలన్నారు