హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు అధికారులతో కలిసి గురువారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన కాలనీలో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులు డ్రైనేజీ సమస్య ఉందని తెలుపగా వెంటనే పరిశీలించి సమస్యను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.