జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు భీమవరం కలెక్టరేట్‌లో ఎన్‌కార్డ్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ గంజాయి సాగు, రవాణా, అమ్మకం, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ 2025 జనవరి నుండి ఇప్పటివరకు 8 కేసులు నమోదు చేసి 33 మందిని అరెస్టు చేశామని, 25.286 కిలోల గంజాయి, ఒక వాహనాన్ని సీజ్ చేశామని తెలిపారు. జిల్లాలో 86 పాఠశాలలు, 225 కళాశాలల వద్ద గోడపత్రికలు ఏర్పాటు చేశామన్నారు.