రాజంపేట రాయచోటి రహదారిలో పుల్లంపేట మండలం శ్రీ రంగరాజుపాలెం సమీపంలో చిరుత సంచరిస్తుందని ఆ రోడ్లు ప్రయాణించిన రాజంపేట వాసులు తెలిపారు శుక్రవారం రాత్రి రాయచోటి నుంచి రాజంపేటకు కారులో వస్తుండగా ఎస్టీ కాలనీ, ఎకో పార్క్కి వద్ద చిరుత పులి కుడివైపు నుంచి ఎడమవైపుకి రోడ్డు దాటుకుని వెళ్ళింది అన్నారు. చిరుత పులి సంచారం ఉన్నందున స్థానికులు ప్రపంచకంగా ఉండాలి అన్నారు. దీనిపై ఫారెస్ట్ అధికారులు స్పందించాల్సి ఉంది.