ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన 495 కుటుంబాలకు గోవిందరావుపేట మండలంలోని ప్రాజెక్టు నగర్ లో పలు గ్రామాల లోని 149 కుటుంబాలకు నేడుమంగళవారం రోజున సాయంత్రం 4 గంటలకు పంపిణీ చేశారు. స్వచ్ఛంద సేవా సంస్థ యునైటెడ్ వే ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి బియ్యం,పప్పులు, నూనె, గోధుమ పిండి, సబ్బులు తదితర నిత్యావసర సరుకులను అంద చేయడం జరుగుతుందని తెలిపారు. బాధిత కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ సహాయాన్ని అందించడం మూసుకొచ్చారని అన్నారు. ప్రతి సంవత్సరం భారీ వర్షాల వలన పలు గ్రామాల్లో ప్రజలు నష్టపోతుంటారు.