పనీపాటా లేకుండా పొద్దస్తమానం టీవీ చూస్తుంటే జీవనం ఎలా గడుస్తుందని తల్లి మందలించిందని కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం ఉదయం కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో జరిగింది. త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ వేణుగోపాల్ వివరాల మేరకు.. YMR కాలనీలో నివాసం ఉంటున్న హమాలి వర్కర్ రంగనాయకులు కుమారుడు మాణిక్యం శనివారం ఉదయాన్నే టీవీ చూస్తుండటంతో తల్లి మందలించింది. మనస్తాపం చెందిన మాణిక్యం (21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.