Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 31, 2025
యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆరోపించారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని రేగొండ మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అక్కడికి చేరుకొని బలవంతంగా ఆయనను ధర్నా విరమింపజేసిఠానాకి తరలించారు అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆదివారం మధ్యాహ్నం 12:20 గంటలకు మాట్లాడారు.