రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజిపూర్ లో 125 ఎకరాల భూమి కోసం రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా సిపిఎం నాయకులు గ్రామపంచాయతీ ముందు ధర్నాకు దిగారు. రైతులు ఆ భూమిలో జెండా పాతడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు .ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.