శ్రీ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్ జె రత్నాకర్ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు ఘనంగా నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం రత్నాకర్ 55వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఆయన నివాసం వద్ద పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున కేకులు తీసుకువెళ్లి కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుతూ పంచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి రత్నాకర్ దంపుతులను హనుమాన్ సర్కిల్ వరకు పోలవర్షంతో అపూర్వ స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకున్నారు. హనుమాన్ సర్కిల్లో భారీ గజమాలలతో సత్కరించారు.