నిజాంసాగర్ ప్రాజెక్టు లో పడి వ్యక్తి గల్లంతు.... ప్రాజెక్ట్ అందాలను తిలకిస్తూ ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ప్రాజెక్ట్ లో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో శనివారం చోటు చేసుకుంది. నిజాంసాగర్ ఎస్సై శివ కుమార్ శనివారం సాయంత్రం 5:30 కు మాట్లాడుతూ గల్లంతైన వ్యక్తి వివరాలను అతని బైక్ ఆధారంగా గుర్తించగా అతడు పిట్లం మండలం అల్లా పూర్ గ్రామానికి చెందిన గైని పండరిగా గుర్తించామని తెలిపారు. ప్రాజెక్ట్ లో గల్లంతైన వ్యక్తి ఆచూకీ గురించి గాలిస్తున్నామని అన్నారు. సదరు వ్యక్తి బంధువులకు సమాచారం అందించామని తెలిపారు