ఏలూరు సత్రంపాడులో అంబికా దేవి ఆలయాన్ని దర్శించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా పండుగ సమయంలో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నానని చెప్పారు. ఏలూరు జిల్లా అభివృద్ధి కోసం చేస్తున్న పనులన్నీ విజయవంతం కావాలని అమ్మవారిని ప్రార్ధించినట్లు తెలిపారు. 12 అర్వోబీల నిర్మాణ పనులు జనవరి నుంచి మొదలయ్యే అవకాశం ఉందని, ప్రతిష్ఠాత్మకమైన నేవీ డిపో ప్రాజెక్ట్ కూడా మన ఏలూరు జిల్లాకు వచ్చిందనిఅన్నారు