సంగారెడ్డి పట్టణం పాత బస్టాండ్ సమీపంలో ఉన్న భరోసా కేంద్రాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, భరోసా కేంద్రంలో బాధిత మహిళలకు అందిస్తున్న సేవల గురించి ఆమె అడిగి తెలుసుకున్నారు. బాధిత బాలికలు, మహిళలకు అండగా ఉండాలని, మహిళలకు ఉన్న చట్టాలపై అవగాహన కల్పించాలని ఆమె సూచించారు.