రైతులకు యూరియా సమస్య తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నంద్యాల పట్టణంలోని ఆర్ & బీ గెస్ట్ హౌస్ లో నేడు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు.యూరియా కొరత అంశంపై నంద్యాల కలెక్టర్ తో మంత్రి బీసీ చర్చించారు.జిల్లా వ్యాప్తంగా వ్యవసాయానికి అవసరమైన మేరకు యూరియాను రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు.