తాడిపత్రి బస్టాండ్లోని సమస్యలను కళ్లారా చూశానని, అక్టోబర్ 2వ తేదీలోగా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బస్టాండ్లో పైకప్పు దెబ్బతిని పెచ్చులు ఊడుతోందని అన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ను ఎంపిక చేశామని చెప్పారు. అక్టోబర్ 2లోగా పూర్తి కాకుంటే మీరే మమ్మల్ని ప్రశ్నించండి అని చెప్పారు.