సమాచార పౌర సంబంధాల శాఖ సహాయ సంచాలకులు మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారిగా క్షత్రి బాలమన్ సింగ్ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. ఇంతవరకు డిఐపిఆర్ఓగా వ్యవహరించిన ఎల్.రమేష్ పదోన్నతిపై గుంటూరుకు బదిలీకావడంతో ఆయన స్థానంలో సింగ్ ను నియమిస్తూ సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. 2019 - 2021 మధ్య కాలంలో పార్వతీపురం డివిజనల్ పౌర సంబంధాల అధికారిగా బాలమన్ సింగ్ పనిచేసారు. ఆ తదుపరి 2022లో శ్రీకాకుళం జిల్లా పౌర సంబంధాల అధికారిగా పదోన్నతి పొంది, ప్రస్తుతం పాడేరు జిల్లా పౌర సంబంధాల అధికారిగా కొనసాగుతున్నారు.