టీటీడీ లో 700పోస్టులు భర్తీలో తెలుగు ప్రాంత బ్రాహ్మణులు కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు పీవీయెస్ వి ప్రసాదరావు. సూగురు రఘునాథరావు లు విజ్ఞప్తి చేసారు.తిరుమల తిరుపతి దేవస్థానం లో వేద పారాయణ దార్ పోస్టులు భర్తీకి టీటీడీ చర్యలు చేపట్టడం తో బ్రాహ్మణులలో ఆశలు ఉండేవని అయితే డిప్యూటీ ఈ వో మరియు కార్యాలయ ఓఎస్ డి గోవిందరాజన్ గోల్ మాల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు వివిధ మాద్యమాల లో వార్తలు రావడం తో బ్రాహ్మణులలు ఆందోళన చెందు తున్నారని వారు పేర్కొన్నారు.