కన్నాయిగూడెం మండలం సింగారం వద్ద ప్రమాదవశాత్తు కిందపడిన వ్యక్తిని 108 సిబ్బంది కాపాడారు. చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన వినయ్ సింగారం నుంచి ఏటూరునాగారం వైపు బైక్ పై వెళ్తుండగా ఆదివారం సాయంత్రం అదుపు తప్పి కిందపడిపోయాడు. స్థానికులు 108కు సమాచారం అందించగా పైలట్ రవీందర్, ఈఎంటీ మహేశ్వరి ఘటనా స్థలానికి చేరుకొని వినయు ప్రథమ చికిత్స అందించారు.