రామంతపూర్ చౌరస్తా వద్ద అన్ని పార్టీల నాయకులు శనివారం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. యాదవ సంఘం అధ్యక్షుడు మాట్లాడుతూ రామంతపూర్ లో ఇటీవల విద్యుత్ షాక్ తో చనిపోయిన బాధిత కుటుంబాలకు కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు.