చిన్నవయసులో వివాహాలు జరిపితే శిక్షలు తప్పవని కోటబొమ్మాళి కోర్ట్, జూనియర్ సివిల్ జడ్జ్, చైర్ పర్సన్, ఎస్.వాణి పేర్కొన్నారు. మంగళవారం కోటబొమ్మాళి కోర్టులో అధికారులు, పోలీసులు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. చిన్న వయసులో గర్భం దాల్చడంతో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయన్నారు. మేజర్లకు మాత్రమే వివాహాలు జరపాలని సూచించారు. బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు పాల్గొన్నారు