కర్నూల్ : పండ్లు అమ్ముకుంటూ బతుకుతున్న మహిళాపై మున్సిపల్ అధికారి దౌర్జన్యం చేస్తున్నారని చర్యలు తీసుకోవాలని కర్నూలు నగరానికి చెందిన సువర్ణ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ –“కమిషనర్ సార్ మమ్మల్ని బతకనివ్వండి. నగరంలోని సెంట్రల్ ప్లాజా ఎదుట పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నాను. కానీ నేను మున్సిపల్ అధికారి అని నిరంతరం దుర్భాషలాడుతూ, మా దగ్గర ఉన్న పనులు లాక్కుంటూ, డబ్బులు దోచుకుంటూ, వ్యభిచారం చేసి బతకమంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. మాపైన దాడులు చేస్తున్నారు.మేము ఎప్పుడూ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా రోడ్డుపక్కన బండి మీద పండ్లు అమ్ముతుంటాం. అ