జగ్గంపేట మండలం రాజపూడి అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జగ్గంపేట సీడీపీఓ M.పూర్ణిమ ఆధ్వర్యంలో సోమవారం పోషకహర దినోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.నిర్వహించిన కార్యక్రమానికి సర్పంచ్ భూసాల విష్ణు మూర్తి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.తల్లులు పోషక విలువలు తో కూడిన పిండి వంటలు ప్రతి ఒకరు వారి ఇళ్ల వద్ద తయారు చేసి తీసుకుని వచ్చారు వారిలో ముగ్గురుని ఎంపిక చేసి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా అందజేశారు.