శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని ఎర్రదొడ్డి గ్రామంలో గల గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని దుండగులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయం తలుపులు పగలగొట్టి ఆలయంలోని హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. బుధవారం ఉదయం ఆలయం వద్దకు వెళ్లిన గ్రామస్తులు దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.