ప్రకాశం జిల్లా కొండపీ మండలం వేరేదేపి గ్రామంలో గురువారం మహాత్మా గాంధీ పథకానికి వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని సిపిఐ నాయకులు రైతులతో కలిసి నిరసన తెలిపారు. పెరిగిన కూలీలు గిట్టుబాట్లు లేని ధరలతో రైతులు నష్టపోతున్నారని మహాత్మా గాంధీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసి రైతులకు మేలు చేయాలని సిపిఐ నాయకులు ఆంజనేయులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక రైతులు పాల్గొన్నారు.