కాకినాడ రూరల్ మండలం సర్పవరం ఐటీ సెజ్ లో నిర్మించిన ఇంక్యుబేషన్ టవర్ ను పరిశీలించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి. బుధవారం కాకినాడ రూరల్ మండలం సర్పవరం ఐటీ సెజ్ లో నిర్మించి నిరుపయోగంగా వదిలేసిన ఇంక్యుబేషన్ టవర్ ను కాకినాడ జిల్లా కలెక్టర్ షన్మోహన్ సగిలి పరిశీలించారు. దీనిని వినియోగంలోనికి తీసుకువచ్చి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఏ విధంగా ప్రోత్సహించాలి, నిరుద్యోగ యువతకు ఏ విధంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే అంశంపై ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ రమణారెడ్డి, ఇతర అధికారులు తదితరులతో చర్చించారు.